నగరాల్లో 'స్వచ్ఛ గాలి' పెంపుకు.. ‘క్లీన్ ఎయిర్ ప్రాజెక్ట్’!
- ఈ ప్రాజెక్ట్ అమలుకు రూ.4,400 కోట్లు
- దేశ వ్యాప్తంగా పట్టణాల్లో కాలుష్యం పెరిగింది
- కాలుష్య నియంత్రణకు విధానాలు రూపొందిస్తాం
ఈ పథకం అమలు కోసం రూ.4,400 కోట్లు కేటాయిస్తున్నట్లు తెలిపారు. ప్రజల ఆరోగ్య పరిరక్షణ, కాలుష్య నియంత్రణ, స్వచ్ఛమైన గాలికోసం ఈ పథకాన్ని తెస్తున్నట్లు చెప్పారు. ఈ పథకంలో భాగంగా చెట్లు నాటడం, కాలుష్య నియంత్రణకు కొత్త విధానాలు రూపొందించడానికి ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తుందన్నారు. నగరాల్లో ప్రజలు స్వచ్ఛమైన గాలిని పీల్చుకోలేకపోవడం దురదృష్టకరమంటూ నిర్మల వ్యాఖ్యానించారు.