Spice Jet: స్పైస్ జెట్ డేటాబేస్ ను హ్యాక్ చేసి... ఆపై అధికారులకు అసలు విషయం చెప్పిన యువకుడు!

  • 12 లక్షల మంది ప్రయాణికుల వివరాలు సేకరణ
  • హ్యాకింగ్ అనంతరం సీఈఆర్టీకి తెలియజేసిన యువకుడు
  • సెక్యూరిటీ రీసెర్చర్ గా పనిచేస్తున్న యువకుడు

ఓ ఎథికల్ హ్యాకర్ ప్రముఖ విమానయాన సంస్థ స్పైస్ జెట్ ప్రయాణికుల వివరాలను హ్యాక్ చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. సెక్యూరిటీ రీసెర్చర్ గా పనిచేస్తున్న సదరు హ్యాకర్ స్పైస్ జెట్ డేటాబేస్ ను విజయవంతంగా ఓపెన్ చేయగలిగాడు. కొన్ని కాంబినేషన్లు ప్రయత్నించి, ఆపై స్పైస్ జెట్ పాస్ వర్డ్ కనుగొనడంలో సఫలమయ్యాడు. ఏకంగా 12 లక్షల మంది ప్రయాణికుల వివరాలను సేకరించగలిగాడు. ప్రయాణికుల ఫోన్ నెంబర్లు, మెయిల్ ఐడీలు అన్నీ అతడి వశమయ్యాయి.

అయితే, తాను స్పైస్ జెట్ డేటాను హ్యాక్ చేసిన విషయాన్ని ఆ యువకుడు కేంద్ర ప్రభుత్వానికి చెందిన కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (సీఈఆర్టీ)కి తెలియజేశాడు. తాను స్పైస్ జెట్ వంటి పెద్ద సంస్థ డేటాబేస్ ను ఎలా హ్యాక్ చేశాడో అతడి నోట విన్న సీఈఆర్టీ నిపుణులు విస్మయానికి గురయ్యారు. స్పైస్ జెట్ సైబర్ భద్రత ఎంతో లోపభూయిష్టంగా ఉందని, తాను పాస్ వర్డ్ ను తేలిగ్గానే ఊహించగలిగానని వెల్లడించాడు.

More Telugu News