కొనసాగుతున్న ఉపరితల ద్రోణి.. కోస్తాలో వర్షాలు పడే అవకాశం!

  • బంగాళాఖాతంలో కొనసాగుతున్న ద్రోణి
  • వచ్చే 24 గంటల్లో చెదురుమదురుగా వర్షాలు
  • రాయలసీమలో పొడి వాతావరణ
కోస్తాలో అక్కడక్కడ ఉరుములతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని విశాఖపట్టణంలోని వాతావరణ కేంద్రం తెలిపింది. పశ్చిమ బెంగాల్‌ నుంచి ఒడిశా మీదుగా కోస్తా వరకు బంగాళాఖాతంలో ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. దీని ప్రభావంతో వచ్చే 24 గంటల్లో కోస్తాలో చెదురుమదురుగా ఉరుములతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని పేర్కొంది. అలాగే, రాయలసీమలో పొడి వాతావరణం కొనసాగుతుందని తెలిపింది.

Go Back to Shorts
Coastal AP
Rayalaseema
rains
Andhra Pradesh

More Telugu News