కరోనా దెబ్బ... చైనాతో సరిహద్దులను మూసివేయాలని రష్యా నిర్ణయం
- చైనాలో కరోనా ఘంటికలు
- నానాటికి విస్తరిస్తున్న ప్రాణాంతక వైరస్
- కీలక నిర్ణయం తీసుకున్న రష్యా
ఇప్పటికే భారత్ సహా అనేక దేశాలు చైనాకు విమాన సర్వీసులు నిలిపివేశాయి. చైనాలో ఉన్న తమ పౌరులను వెనక్కి రప్పించేందుకు అనేక దేశాలు ముమ్మర ప్రయత్నాలు సాగిస్తున్నాయి. చైనాలోని వుహాన్ నగరంలో మొదలైన ఈ వైరస్ ముప్పు క్రమంగా ఇతర ప్రాంతాలకు, ఇతర దేశాలకు వ్యాపిస్తోంది. ఇప్పటివరకు చైనాలో కరోనా వైరస్ కారణంగా 170 మంది ప్రాణాలు కోల్పోయారు.