అబార్షన్లపై కీలక నిర్ణయం తీసుకున్న కేంద్ర ప్రభుత్వం
- ఇప్పటి వరకు 20 వారాల వరకు గర్భం ఉన్నవారికే అబార్షన్లు చేయించుకునే అవకాశం
- పరిమితిని 24 వారాలకు పెంచుతూ కేంద్ర ప్రభుత్వ నిర్ణయం
- పునరుత్పత్తి హక్కులను కాపాడినట్టవుతుందన్న జవదేకర్
మహిళలు గర్భాన్ని తొలగించుకునే పరిమితిని 24 వారాలకు పెంచడం ద్వారా వారి పునరుత్పత్తి హక్కులను కాపాడినట్టవుతుందని ఆయన తెలిపారు. మొదటి ఐదు నెలల (20 వారాలు) తర్వాత శారీరక ఇబ్బందులు ఎదుర్కొనే గర్భిణులు... ఆ తర్వాత అబార్షన్ చేయించుకోవాలంటే కోర్టులకు వెళ్లాల్సి వస్తోందని... ఈ నేపథ్యంలో అబార్షన్ కు నాలుగు వారాల గరిష్ట పరిమితిని పెంచడం వారి హక్కులను కాపాడటమేనని చెప్పారు.