CPI: రాజధానిపై పోరాటాన్ని ఆపం : సీపీఐ నేత రామకృష్ణ

  • రేపు రాష్ట్ర వ్యాప్తంగా బైక్ ర్యాలీ
  • బుధవారం తెనాలిలో బహిరంగ సభ
  • త్వరలోనే ఛలో ఢిల్లీ కార్యక్రమం

అమరావతి నుంచి రాజధాని తరలింపును అడ్డుకోవడానికి ఉద్యమాన్ని మరింత తీవ్రం చేస్తామని సీపీఐ నేత రామకృష్ణ అన్నారు. ఈ రోజు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుతో సీపీఐ నేతలు ముప్పాళ్ల నాగేశ్వరరావు, రామకృష్ణ సమావేశమయ్యారు. ఈ సమావేశం అనంతరం రామకృష్ణ మీడియాతో మాట్లాడుతూ..రాజధానిపై భవిష్యత్ పోరాటంపై చంద్రబాబుతో చర్చించినట్లు తెలిపారు. అమరావతిపై ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామన్నారు.

రేపు అన్ని నియోజకవర్గాల్లో జేఏసీ బైక్ ర్యాలీ చేపడుతున్నట్లు ప్రకటించారు. బుధవారం తెనాలిలో జేఏసీ ఆధ్వర్యంలో బహిరంగ సభ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సభలో ఎమ్మెల్సీలను సన్మానం చేస్తామన్నారు. రానున్న రోజుల్లో ర్యాలీలు, సభలు నిర్వహిస్తామన్నారు. రాష్ట్రపతి, ప్రధానమంత్రి, కేంద్ర మంత్రులను కలిసి పరిస్థితిని వివరిస్తామని చెప్పారు. పార్లమెంటు సమావేశాలు ఉన్నందున ఈ నెలాఖరున ఢిల్లీ వెళతామని చెప్పారు. అన్ని పార్టీలతో చర్చించి మద్దతు కూడగడతామన్నారు. రాజధానిపై పోరాటాన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.

More Telugu News