గర్భం దాల్చిన 12 ఏళ్ల బాలిక.. ఆరోగ్య పరీక్షల్లో బయటపడిన వైనం
- అనాథగా మిగిలిన బాలికను ఇంటికి తీసుకొచ్చిన మేనమామ
- వివాహం చేసుకుని కాపురం
- విచారణ చేపట్టిన ఐటీడీఏ అధికారులు
శ్రీకాకుళం జిల్లా మందస మండలంలోని బుడారిసింగి పంచాయతీ పరిధిలోని గుడ్డికోలకు చెందిన యువకుడు, తనకు మేనకోడలు అయిన బాలికను ఇంటికి తీసుకొచ్చి ఆశ్రయం కల్పించాడు. ఈ క్రమంలో ఆమెను వివాహం చేసుకున్నాడు. శుక్రవారం జాతీయ బాలికా దినోత్సవాన్ని పురస్కరించుకుని సిరిపురం ఆరోగ్య కేంద్రంలో బాలికలకు వైద్య పరీక్షలు నిర్వహించారు. పరీక్షల్లో ఆమె గర్భిణి అని తేలడంతో విస్తుపోయిన వైద్యాధికారులు వెంటనే సీతంపేట ఐటీడీఏ అధికారులకు సమాచారం అందించారు. వారు గ్రామానికి చేరుకుని విచారణ చేపట్టారు.