తప్పు ఒప్పుకొని సరిదిద్దుకుంటే.. మండలిని కొనసాగించే అవకాశం: ఎమ్మెల్సీ సునీత
- వికేంద్రీకరణ బిల్లుపై మండలి ఛైర్మన్ వైఖరి సరికాదు
- ఆయన నిర్ణయం ప్రజాస్వామ్యాన్ని నవ్వులపాలు చేసేలా ఉంది
- ప్రజలకు మేలు చేయాలనే సీఎం జగన్ ఈ బిల్లును తెచ్చారు
తప్పును సరిదిద్దుకుంటే శాసన మండలిని సీఎం జగన్ కొనసాగించే అవకాశముందని ఈ సందర్భంగా సునీత వ్యాఖ్యానించారు. ఇదిలావుండగా శాసన మండలి రద్దుకు వైసీపీ ప్రభుత్వం సమాలోచనలు చేస్తున్న విషయం తెలిసిందే. మండలి నిర్వహణకు ఏడాదికి రూ.60 కోట్లు వృథా అవుతున్నాయంటూ ప్రభుత్వం పేర్కొంటోంది.