నాకే శిక్ష వేస్తారా?.. అందుకే బాంబు పెట్టా: ‘మంగళూరు’ నిందితుడు
- ఇంజినీరింగ్, ఎంబీయే చేసిన నిందితుడు
- మంగళూరు విమానాశ్రయంలో బాంబు పెట్టిన వైనం
- గతంలో పోలీసులు అరెస్ట్ చేసి శిక్షించినందుకేనన్న నిందితుడు
తనది మణిపాల్ అని, ఓ ప్రైవేటు బ్యాంకులో ఉద్యోగం కోసం 2012లో బెంగళూరు వచ్చానని పేర్కొన్నాడు. ఆ తర్వాత ఉద్యోగానికి రాజీనామా చేసి మంగళూరు వచ్చానని వివరించాడు. 2018లో బెంగళూరు విమానాశ్రయంలో బాంబు ఉందని బెదిరింపు ఫోన్ కాల్ చేసిన ఆదిత్యరావు.. ఆ కేసులో అరెస్ట్ అయి శిక్ష కూడా అనుభవించాడు. తనకు శిక్ష వేయించినందుకు పోలీసులపై కక్ష తీర్చుకునేందుకే మంగళూరు విమానాశ్రయంలో బాంబు పెట్టినట్టు నిందితుడు పేర్కొన్నాడు.