విదేశీ కంపెనీలకు దీటుగా 'ఆల్ట్రోజ్' 'ను తీసుకువచ్చిన టాటా మోటార్స్
- ప్రీమియం హ్యాచ్ బ్యాక్ సెగ్మెంట్లో తొలికారు తీసుకువచ్చిన టాటా
- ధర రూ.5.29 లక్షల నుంచి ప్రారంభం
- బీఎస్ 6 ప్రమాణాలతో తయారైన ఆల్ట్రోజ్
ప్రీమియం హ్యాచ్ బ్యాక్ విభాగంలో సుజుకి బాలెనో అత్యధిక అమ్మకాలతో అగ్రగామిగా కొనసాగుతోంది. అటు హ్యుందాయ్, హోండా కూడా ఫర్వాలేదనిపించేలా అమ్మకాలు జరుపుతున్నాయి. ఈ నేపథ్యంలో దేశీయ కంపెనీ టాటా మోటార్స్ నుంచి వచ్చిన ఆల్ట్రోజ్ ఎలాంటి పోటీ ఇస్తుందన్నది మార్కెట్ వర్గాల్లో ఆసక్తి కలిగిస్తోంది. అయితే ఆల్ట్రోజ్ లో 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్ మిషన్ వ్యవస్థను మాత్రమే ఏర్పాటు చేశారు. ప్రస్తుతానికి ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్ లేదు.