వైసీపీలోకి కడప జిల్లా సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే వీర శివారెడ్డి?
- వైసీపీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డితో భేటీ
- గ్రామ సచివాలయం ప్రారంభానికి వచ్చిన రవీంద్రనాథ్ రెడ్డి
- రాజధానిపై ప్రతిపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయన్న ఎమ్మెల్యే
ఈ సందర్భంగా రవీంద్రనాథ్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. అధికారం చేపట్టిన ఏడు నెలలకే ఇచ్చిన హామీలలో 80 శాతం నెరవేర్చిన ఘనత సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డికి దక్కుతుందన్నారు. అమరావతి రాజధానిపై ప్రతిపక్షాలు అనవసరమైన రాద్ధాంతం చేస్తున్నాయన్నారు. అన్ని ప్రాంతాల సమానాభివృద్ధే లక్ష్యంగా సీఎం జగన్ ముందుకు సాగుతున్నారన్నారు.