రేవ్ పార్టీ నిందితుల కోసం పోలీసుల ముమ్మర గాలింపు
- రేవ్ పార్టీని ఏర్పాటు చేసిన విత్తన సంస్థ!
- వివిధ రాష్ట్రాల నుంచి యువతులు
- నిందితుల కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసిన పోలీసులు
సమాచారం అందుకున్న టాస్క్‌ఫోర్స్ పోలీసులు పబ్బులో తనిఖీలు చేపట్టారు. 21 మంది యువతులను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం నోటీసులిచ్చి పంపారు. అదే సమయంలో పబ్బు యజమానులు సంతోష్ రెడ్డి, భరత్‌తోపాటు రేవ్ పార్టీ నిర్వాహకులు ప్రసాద్, శ్రీనివాస్ నాయుడు పరారయ్యారు. ఓ విత్తన సంస్థ ప్రతినిధులే ఈ రేవ్ పార్టీ ఏర్పాటు చేసినట్టు గుర్తించిన పోలీసులు, దీనిని నిర్ధారించే పనిలో ఉన్నారు. అందులో భాగంగా పరారీలో ఉన్న నిందితుల కోసం ముమ్మర గాలింపు చేపట్టారు.