Kalyan Ram: తాతగారి సినిమాల్లో 'పాతాళభైరవి' అంటే ఇష్టం: హీరో కల్యాణ్ రామ్

షార్ట్స్‌లో చూడండి
తాజాగా 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో కల్యాణ్ రామ్ మాట్లాడుతూ, తన తాతగారైన ఎన్టీ రామారావు గురించి ప్రస్తావించాడు. "మా తాతగారు చేసిన సినిమాల్లో నాకు 'పాతాళ భైరవి' అంటే చాలా ఇష్టం. సహజంగానే ఆయన చాలా అందగాడు. అయితే 'పాతాళ భైరవి'లో ఇంకా అందంగా వుంటారు.

ఆ మధ్య .. మా తాతగారు చేసిన ఒక సినిమాను టీవీలో చూశాను. నిజంగా ఎంత అందగాడు అనిపించింది. ఆయన అందం మనవాళ్లు .. మనవరాళ్లలో ఎవరికీ రాలేదు. మా అమ్మగారితో కూడా ఇదే మాట అన్నాను. 'పాతాళ భైరవి' తరువాత నాకు బాగా నచ్చే సినిమాల్లో 'మాయా బజార్'.. 'మిస్సమ్మ' .. 'గుండమ్మ కథ'. ఇక మా తాతగారి తరువాత మా బాబాయ్ బాలకృష్ణగారు అందగాడు అని చెప్పాలి. ఆయన సినిమాల్లో 'ఆదిత్య 369' అంటే నాకు చాలా ఇష్టం. ఆ సినిమాలో ఆయన మేకప్ లేకుండా చేసినా చాలా అందంగా కనిపించారు" అని చెప్పుకొచ్చాడు.
Go Back to Shorts
Kalyan Ram
Mehreen

More Telugu News