కాకినాడలో పవన్ కల్యాణ్ ర్యాలీకి అనుమతి నిరాకరణ.. 'అతిక్రమిస్తే చర్యలే' అంటున్న జిల్లా ఎస్పీ!
- ఎమ్మెల్యే ద్వారంపూడి ఇంటి వద్ద ఘర్షణ
- గాయపడిన జనసేన కార్యకర్తలకు నేడు పవన్ పరామర్శ
- ర్యాలీలు, సభలకు అనుమతి లేదన్న ఎస్పీ
పవన్ ర్యాలీలు, సభలు లేకుండా నగరానికి రావచ్చని, తన పార్టీ కార్యకర్తలను పరామర్శించవచ్చని అన్నారు. అందుకు విరుద్ధంగా బహిరంగ ప్రదర్శన నిర్వహిస్తే మాత్రం అడ్డుకుంటామని స్పష్టం చేశారు. కాగా, నిన్నటి వరకూ న్యూఢిల్లీలో ఉన్న పవన్, ఈ ఉదయం విశాఖ విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన కాకినాడకు వచ్చి, గాయపడిన వారిని పరామర్శించాలని నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే.