రోడ్డు ప్రమాదంలో గాయాలపాలైన వరల్డ్ నెంబర్ వన్ బ్యాడ్మింటన్ ప్లేయర్
- మలేసియా మాస్టర్స్ టైటిల్ నెగ్గిన జపాన్ క్రీడాకారుడు కెంటో మొమోటా
- కౌలాలంపూర్ లో ఎయిర్ పోర్టుకు వెళుతుండగా ప్రమాదం
- లారీని ఢీకొట్టిన మొమోటా ప్రయాణిస్తున్న వ్యాన్.. డ్రైవర్ మృతి
విషాదం ఏంటంటే, మొమోటా ప్రయాణిస్తున్న వ్యాన్ డ్రైవర్ ఈ ప్రమాదంలో మరణించాడు. మొమోటా అసిస్టెంట్ కోచ్ కు, ఫిజియోథెరపిస్ట్ కు, బ్యాడ్మింటన్ సంఘం అధికారికి గాయాలు తగిలాయి. ఈ ఘటనపై వెంటనే స్పందించిన పోలీసులు కెంటో మొమోటా, అతడి టీమ్ ను వెంటనే ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం మొమోటా ఆరోగ్య స్థితి నిలకడగా ఉందని తెలుస్తోంది.