అంకెల గారడీతో జగన్ జనాలను మోసం చేస్తున్నారు: యనమల రామకృష్ణుడు

11-01-2020 Sat 19:20
  • రాష్ట్రంలో ఉన్నది గూండాల ప్రభుత్వమా? పోలీసు రాజ్యమా? 
  • ఈ సర్కారుకు తర్వలోనే గుణపాఠం చెప్పే రోజు వస్తుంది
  • తనపై ఉన్న కేసుల్లో జగన్ కు  శిక్ష పడటం ఖాయం

సీఎం జగన్ అంకెల గారడీతో ప్రజలను మోసం చేస్తున్నారని టీడీపీ నేత యనమల రామకృష్ణుడు విమర్శించారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ..ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, రాజధాని అంశాల్లో వైసీపీ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని తూర్పారబట్టారు. అమరావతి రాజధానిపై పోరాటం చేస్తోన్న రైతులపై వైసీపీ ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును ఆక్షేపిస్తూ.. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్నది గూండాల ప్రభుత్వమా? పోలీసు రాజ్యమా? అని ప్రశ్నించారు. ఈ సర్కారుకు తర్వలోనే గుణపాఠం చెప్పే రోజు వస్తుందన్నారు. జగన్ పై ఉన్న కేసులన్నీ రుజువై శిక్ష పడటం ఖాయమని జోస్యం చెప్పారు.