విమానాన్ని కూల్చేసింది మేమే.. కావాలని కూల్చలేదు: నిజాన్ని ఒప్పుకున్న ఇరాన్
- టెహ్రాన్ సమీపంలో కూలిపోయిన ఉక్రెయిన్ కు చెందిన విమానం
- 176 మంది దుర్మరణం
- మానవ తప్పిదమే ఘటనకు కారణమన్న ఇరాన్
ఈ తరుణంలో, విమానాన్ని తామే కూల్చేశామంటూ ఇరాన్ ఎట్టకేలకు ఒప్పుకుంది. ఇరాన్ విదేశాంగ మంత్రి జవద్ జరీఫ్ ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ, ఉద్దేశపూర్వకంగా ఈ చర్యకు పాల్పడలేదని తెలిపారు. కేవలం మానవ తప్పిదంగానే దీన్ని పరిగణించాలని కోరారు. అమెరికా దుందుడుకు చర్యలే ఈ ఘటనకు దారి తీశాయని చెప్పారు. మృతుల కుటుంబసభ్యులకు, తమ పౌరులను కోల్పోయిన దేశాలకు క్షమాపణలు చెబుతున్నామని అన్నారు.
విమానం కూలిపోయిన తర్వాత... ఇరానే ఈ చర్యకు పాల్పడిందనే ఆరోపణలు వచ్చాయి. అయితే, ఈ ఆరోపణలను ఇరాన్ ఖండించింది. కానీ, ఇరానే విమానాన్ని కూల్చిందంటూ అమెరికా, కెనడా ఇంటెలిజెన్స్ విభాగాలు ప్రకటించాయి. దీనికి తోడు, విమానాన్ని ఓ అగ్నిగోళం వంటి వస్తువు తాకిన ఓ వీడియో కూడా బహిర్గతమైంది. ఈ నేపథ్యంతో, చివరకు ఇరాన్ నిజాన్ని ఒప్పుకోక తప్పలేదు.