చివర్లో చిచ్చరపిడుగులా ఆడిన శార్దూల్ ఠాకూర్... భారత్ భారీ స్కోరు
- 20 ఓవర్లలో 6 వికెట్లకు 201 పరుగులు చేసిన టీమిండియా
- ఫిఫ్టీలు నమోదు చేసిన రాహుల్, ధావన్
- నిరాశ పరిచిన సంజూ శాంసన్
సుదీర్ఘ నిరీక్షణ తర్వాత జట్టులోకి వచ్చిన యువ వికెట్ కీపర్ సంజూ శాంసన్ తాను ఎదుర్కొన్న తొలిబంతినే సిక్స్ గా మలిచి తన ఉద్దేశాన్ని చాటాడు. కానీ ఆ తర్వాతి బంతికే అవుటై అభిమానులను ఉసూరుమనిపించాడు. ఇక కెప్టెన్ కోహ్లీ 26 పరుగులు చేయగా, మనీష్ పాండే 31 పరుగులతో అజేయంగా నిలిచాడు. లంక బౌలర్లలో లక్షన్ సందకన్ 3 వికెట్లతో రాణించాడు.