పాక్ మంత్రికి కోపమొచ్చింది.. టీవీ యాంకర్ చెంప చెళ్లుమంది!

  • టిక్ టాక్ స్టార్ తో సంబంధం అంటగడతావా అంటూ ఆగ్రహం
  • వివాహ వేడుకలో కలిసిన యాంకర్ చెంపపై కొట్టిన మంత్రి
  • పదవులు తాత్కాలికమే.. మనం మనుషులం..  
  • తప్పుడు ఆరోపణలు వచ్చినప్పుడు స్పందించాలి
పాకిస్థాన్ లో ఓ మంత్రి టీవీ యాంకర్ చెంప చెళ్లుమనిపించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. ప్రముఖ టిక్ టాక్ నటి హరీమ్ షాతో తనకు సంబంధం అంటగట్టిన యాంకర్ ముబాషెహర్ పై పాక్ మంత్రి ఫవాద్ చౌదరి ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఓ వివాహ వేడుకలో యాంకర్ ను చూసి అతడిపై చేయి చేసుకున్నారు. ముబాషెహర్ ఓ టీవీ కార్యక్రమం చేస్తూ.. మరో యాంకర్ తో మాట్లాడుతూ.. టిక్ టాక్ స్టార్ హరీమ్ షాతో మంత్రి చౌదరి ఉన్న అసభ్య వీడియోలను చూశానన్నారు. దీన్ని చూసిన మంత్రి యాంకర్ ముబాషెహర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు.

తాజాగా ఓ వివాహ వేడుకలో సదరు యాంకర్ ను చూసి కోపం పట్టలేక చెంప పగులగొట్టారు. ఈ విషయంపై మంత్రి చౌదరి ట్విట్టర్ మాధ్యమంగా స్పందించారు. ‘పదవులు ఉండవచ్చు పోవచ్చు, కానీ మనము మనుషులం. మనపై తప్పుడు ఆరోపణలు వచ్చినప్పుడు స్పందిస్తాం. వ్యక్తి గత ఆరోపణలు చేస్తే సహించేది లేదు’ అని పేర్కొన్నారు. యాంకర్ ముబాషెహర్ ఓ నకిలీ పాత్రికేయుడని తెలిపారు. ఇలాంటి వారు జర్నలిజం విలువలను కాలరాస్తున్నారని విమర్శించారు. ఇలాంటివారి విషయాలను బహిర్గతం చేయడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు.
Go Back to Shorts
Pakistan
Minister
TV Anchor
hit on cheeks

More Telugu News