ఇదే కదా తల్లిపై ప్రేమ... కంటతడి పెట్టిస్తూ, వైరల్ అవుతున్న చిత్రం!
- ఆస్ట్రేలియాను కమ్మేసిన కార్చిచ్చు
- ఇప్పటికే 50 కోట్ల జంతువుల మృతి
- గాయపడిన వాటికి చికిత్స
- 'కోలా'కు చికిత్స చేస్తుంటే బిడ్డ ఉద్వేగం
చిన్న సైజు ఎలుగుబంటిలా కనిపించే శాకాహార జాతికి చెందిన ఈ ఆస్ట్రేలియా జీవి పేరు కోలా. మంటల్లో గాయపడగా, దీనికి వైద్యులు చికిత్స చేస్తున్న వేళ, దీని బిడ్డ, పరుగులు పెడుతూ వచ్చి, తల్లిని గట్టిగా కౌగిలించుకుంది. ఆ సమయంలో అక్కడే ఉన్న మరో డాక్టర్ ఈ చిత్రాన్ని తీసి, సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా, అదిప్పుడు వైరల్ అవుతోంది. తల్లీబిడ్డల మధ్య ఉండే ప్రేమకు ఇది నిదర్శనమని పలువురు వ్యాఖ్యానించారు. చూపరులను భావోద్వేగానికి గురి చేసేలా ఉన్న ఈ ఫొటో వైరల్ అయిన తరువాత తల్లికి 'లిజీ' అని, బిడ్డకు 'ఫాంటమ్' అని నామకరణం చేశారు.