భారీ ర్యాలీతో పోలీస్ స్టేషన్ కు వెళ్లిన అయ్యన్నపాత్రుడు.. మరో కేసు బుక్ చేసిన పోలీసులు!
- సోదరుడు సన్యాసినాయుడితో వివాదం
- పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని ఫిర్యాదు
- తాజాగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని మరో కేసు
నర్సీపట్నంలో భారీ ర్యాలీగా స్టేషన్ కు వెళ్లిన ఆయన, ర్యాలీ ముగింపులో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని ఆరోపించిన పోలీసులు, పలు సెక్షన్ల కింద కేసును రిజిస్టర్ చేశారు. కోడిపందాలపై రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడంతో పాటు, అనుమతి లేకుండా ర్యాలీ, రోడ్ షో నిర్వహించారన్న అభియోగాలను నమోదు చేసిన పోలీసులు, ఐపీసీలోని 504, 189, 188, 341 సెక్షన్ల కింద కేసు పెట్టారు.