చేయని తప్పుకు రాజధాని రైతులను ప్రభుత్వం శిక్షిస్తోంది!: సీపీఎం నేత మధు డిమాండ్
- మూడు రాజధానులకు తమ పార్టీ వ్యతిరేకం
- అసెంబ్లీ, సచివాలయం వేర్వేరు చోట్లంటూ గందరగోళం
- రైతులతో సీఎం వెంటనే సమావేశం ఏర్పాటు చేయాలి
రాజధానిని అమరావతిలో ఏర్పాటు చేయాలని రైతులేమీ అడగలేదని, ప్రభుత్వమే వారిని ఒప్పించిందని గుర్తుచేశారు. అసెంబ్లీ, సచివాలయం వేర్వేరు చోట్ల ఏర్పాటు చేస్తామంటూ గందరగోళం సృష్టిస్తున్నారని, రాష్ట్ర భవిష్యత్ కు ఇది మంచిది కాదని చెప్పారు.