బీసీజీ నివేదికపై త్వరలోనే హైపవర్ కమిటీ సమావేశం: మంత్రి ఆదిమూలపు సురేశ్
- నివేదిక సమర్పించిన బీసీజీ
- స్పందించిన మంత్రి ఆదిమూలపు
- రెండు నివేదికలను ప్రజల ముందుంచుతామని వెల్లడి
అభివృద్ధి వికేంద్రీకరణ దిశగానే తమ ప్రభుత్వ నిర్ణయాలు ఉంటాయని అన్నారు. జీఎన్ రావు కమిటీ నివేదికతో పాటు, బీసీజీ నివేదికను కూడా ప్రజల ముందుకు తీసుకెళతామని మంత్రి పేర్కొన్నారు. అసెంబ్లీలోనూ దీనిపై చర్చించిన తర్వాత సీఎం జగన్ నిర్ణయం ఉంటుందని వివరించారు. రాజధానిపై నియమించిన హైపవర్ కమిటీలో మంత్రి ఆదిమూలపు సురేశ్ కూడా ఓ సభ్యుడు.