ఇకపై రైల్వే ఫిర్యాదులకు, సమాచారానికి ఒకటే నంబర్ ‘139’

  • పన్నెండు భాషల్లో స్పందించే వీలు
  • రైల్వే భద్రతా సేవలకోసం మాత్రం 182 హెల్ప్ లైన్
  • ప్రయాణికుల సౌలభ్యంకోసం భారతీయ రైల్వే చర్యలు
ఇకముందు రైల్వేకు సంబంధించిన సమాచారానికైనా, ఫిర్యాదులకైనా ప్రయాణికులు ‘139’ నంబర్ ను గుర్తుంచుకుంటే సరిపోతుంది. రైల్వే హెల్ప్ లైన్లపై ప్రయాణికులు పడుతున్న ఇబ్బందుల నేపథ్యంలో భారతీయ రైల్వే అన్నింటికీ ఒకే నంబర్ గా 139 ను ప్రకటించింది.

ఈ నంబర్ కు కాల్ చేస్తే.. సమాధానాలు పన్నెండు భాషల్లో అందుబాటులో ఉంటాయంది. దీంతో ప్రయాణికులు పలు సేవలకు విభిన్న నంబర్లను గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం తప్పుతుందని రైల్వే శాఖ పేర్కొంది. ఫిర్యాదు లేదా సమాచారానికైనా 139ని డయల్ చేస్తే సరిపోతుందని రైల్వే శాఖ వెల్లడించింది. అయితే, రైల్వే భద్రతా సేవలకోసం మాత్రం 182 హెల్ప్ లైన్ కు ఫోన్ చేయాల్సి ఉంటుందని తెలిపింది.
Go Back to Shorts
Railways
New Help line
139

More Telugu News