మీ ప్రేమ అమరావతి రైతుల మీదా? లేక బినామీల పేరిట ఉన్న భూముల మీదా?: అంబటి రాంబాబు
- చంద్రబాబు హయాంలో రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు
- అప్పుడు, భువనేశ్వరి జాలి పడలేదే?
- నాడు పుష్కరాల్లో మృతి చెందిన వారిపై ఆమె జాలి పడ లేదే?
ఈ సందర్భంగా అమరావతి పరిరక్షణ సమితికి నారా భువనేశ్వరి తన గాజును విరాళంగా ఇచ్చిన విషయాన్ని ప్రస్తావించారు. చంద్రబాబునాయుడుకు అయితే తన వేలుకు పెట్టుకునేందుకు ఉంగరం లేదు, చేతికి పెట్టుకోవడానికి వాచీ కూడా లేదు కానీ, ఆయన భార్య భువనేశ్వరి మాత్రం తన గాజును తృణప్రాయంగా ఇచ్చేశారని, ఎవరి మీద ప్రేమ రైతుల మీదా? లేక మీ బినామీల పేరిట అక్కడ ఉన్న భూముల మీదా? అని ప్రశ్నించారు. దీని వెనుక కథ ఏంటో తేలాల్సిన అవసరం ఉందని అన్నారు.