వివేకా హత్య కేసులో హరిత హోటల్ సిబ్బంది నుంచి వివరాలు సేకరించిన సిట్ అధికారులు
- పరమేశ్వర్ రెడ్డి చుట్టూ బిగుస్తున్న సిట్ ఉచ్చు
- హత్య జరిగిన తర్వాత పరమేశ్వర్ కదలికలపై సిట్ ఆరా
- కడపలోని ఓ ప్రైవేటు ఆసుపత్రి నుంచి కూడా వివరాల సేకరణ
కాగా, ఓ ప్రైవేటు ఆసుపత్రి నుంచి కూడా వివేకా కేసుకు సంబంధించిన వివరాలు సేకరించారు. తాజాగా జరిగిన ఈ దర్యాప్తు యావత్తు ఈ కేసులో అనుమానితుడుగా ఉన్న కొమ్మా పరమేశ్వర్ రెడ్డి కదలికలపైనే సాగింది. వివేకా హత్య జరిగిన తర్వాత పరమేశ్వర్ రెడ్డి ఆరోగ్యం బాగాలేదని కడప సన్ రైజ్ ఆసుపత్రిలో చేరారు. చికిత్స తర్వాత హోటల్ హరితలో బస చేసి ఓ టీడీపీ నేతను కలిసినట్టు భావిస్తున్నారు. ఆ సమయంలో పరమేశ్వర్ రెడ్డి, టీడీపీ నేతకు మధ్య జరిగిన సంభాషణ ఏంటన్న దానిపైనే సిట్ బృందం ప్రధానంగా దృష్టి సారించింది.