ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం... ప్రమాద స్థలికి చేరుకున్న 35 ఫైర్ ఇంజన్లు
- ఢిల్లీలోని ఓ బ్యాటరీ ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం
- బ్యాటరీలు లీక్ అవ్వడంతో పేలుడు
- భారీగా ఆస్తి నష్టం
ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. సుమారు 35 ఫైర్ ఇంజన్లు ఘటనాస్థలికి చేరుకున్నాయి. అక్కడి ప్రజలను పోలీసులు దూర ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఈ అగ్ని ప్రమాదం కారణంగా భారీగా ఆస్తినష్టం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై పూర్తి సమాచారం అందాల్సి ఉంది.