తన చేయి పట్టుకుని లాగిన మహిళపై పోప్ ఫ్రాన్సిస్ ఆగ్రహం.. అనంతరం ఆమెకు క్షమాపణ!
- గుంపులో నడుస్తూ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన పోప్
- గుంపు మధ్య నుంచి పోప్ చేయి పట్టుకున్న మహిళ
- హఠాత్ పరిణామానికి విస్తుపోయిన పోప్
ఈ హఠాత్ పరిణామానికి విస్తుపోయిన పోప్.. ఆ మహిళ చేసిన పనిపై ఆగ్రహం వ్యక్తం చేసి, సదరు మహిళ చేతిపై చిన్న దెబ్బ వేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో స్పందించిన పోప్ తాను ఆగ్రహం వ్యక్తం చేసిన మహిళకు బుధవారం క్షమాపణలు చెప్పారు.