Suhasini: సుహాసిని అలా కెమెరా ముందుకు వచ్చిందట!

షార్ట్స్‌లో చూడండి
తెలుగు తెరకి అందంతో కూడిన అభినయాన్ని పరిచయం చేసిన కథానాయికలలో సుహాసిని ఒకరు. తెలుగులో ఇప్పుడున్న సీనియర్ స్టార్ హీరోలతో ఆమె వరుస సినిమాలు చేశారు .. ఎన్నో విజయాలను సొంతం చేసుకున్నారు. అలాంటి సుహాసిని గురించి, సీనియర్ జర్నలిస్ట్ బీకే ఈశ్వర్ మాట్లాడుతూ .."మొదటి నుంచి కూడా సుహాసినికి నటనపై పెద్దగా ఆసక్తి ఉండేది కాదు. సినిమాటోగ్రఫీపైనే ఆమె ఎక్కువగా ఆసక్తిని కనబరిచేవారు.

ప్రముఖ సినిమాటోగ్రఫర్ అశోక్ కుమార్ దగ్గర ఆమె కొంతకాలం పాటు అసిస్టెంట్ గా పనిచేశారు. ఆ సమయంలోనే ఆమెను దర్శకుడు భారతీరాజా చూశారు. సుహాసినిలో మంచి నటి ఉందని గ్రహించిన ఆయన, నటన దిశగా ఆమెను ప్రోత్సహించాడు. 'కొత్త జీవితాలు' అనే ఆఫ్ బీట్ ఫిల్మ్ లో ఆమెకి కథానాయికగా అవకాశం ఇచ్చారు. ఆ సినిమా నుంచి ఒక్కో అవకాశాన్ని అందిపుచ్చుకుంటూ,  ఆమె మంచి పేరు తెచ్చుకున్నారు" అని చెప్పుకొచ్చాడు.
Go Back to Shorts
Suhasini
Bharathi Raja

More Telugu News