ఏపీ ప్రభుత్వం కమిటీల పేరుతో కాలయాపన చేస్తోంది: సీపీఎం మధు
- అన్ని పార్టీలను పిలిచి వారి అభిప్రాయాలను తీసుకోవాలి
- రాజధాని అంశం చర్చనీయాశంగా మారింది
- అసెంబ్లీ ఒక చోట, రాజధాని ఇంకో చోట ఉంటుందంటున్నారు
- ఇలా చెప్పడం ఆందోళన కలిగిస్తోంది
రాజధాని అంశం చర్చనీయాంశంగా మారిందని, తాము రైతులు, రాజధాని కోసం పోరాడతామని మధు స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కమిటీల పేరుతో కాలయాపన చేస్తోందని, అసెంబ్లీ ఒక చోట, రాజధాని ఇంకో చోట ఉంటుందని చెప్పడం ఆందోళన కలిగిస్తోందని విమర్శలు గుప్పించారు. అభివృద్ధి వికేంద్రీకరణ పేరుతో ఇటువంటి చర్యలకు పాల్పడడం వల్ల ఉపయోగం లేదని అభిప్రాయపడ్డారు.