Thrissur: వరుడి వయసు 67.. వధువుకి 65 ఏళ్లు.. ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నారు.. ఫొటోలు వైరల్!

షార్ట్స్‌లో చూడండి
వరుడి వయసు 67.. వధువుకి 65 ఏళ్లు.. ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నారు.. ఈ ఘటన కేరళలోని త్రిస్సూర్ జిల్లా రామవరంపురంలో చోటు చేసుకుంది. కొచానియన్ మీనన్ అనే తాతయ్య, పీవీ లక్ష్మీ అమ్మల్ అనే బామ్మ వృద్ధా శ్రమంలో ఉంటున్నారు. వారిద్దరికీ కొన్ని దశాబ్దాలుగా పరిచయం ఉంది.
  భర్త చనిపోవడంతో  లక్ష్మీ ఒంటరిగా ఉంది. రెండేళ్ల క్రితం ఆమె వృద్ధాశ్రమంలో చేరింది. అనంతరం కొచానియన్ మీనన్ కూడా వృద్ధాశ్రమంలో చేరాడు. చివరకు తామిద్దరం పెళ్లి చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. చివరకు నిన్న వారిద్దరు వివాహ బంధంతో ఒక్కటయ్యారు. వారి పెళ్లికి  రామవరంపురం వాసులు ఘనంగా ఏర్పాటు చేశారు. వారి పెళ్లికి సంబంధించిన ఫొటోలను కొందరు సోషల్ మీడియాలో పోస్టు చేశారు.  
Go Back to Shorts
Thrissur
Kerala

More Telugu News