Mahith: నాన్నకి మించి నన్ను చూసుకున్నది మా అన్నయ్యే: చక్రి సోదరుడు మహిత్ నారాయణ్

షార్ట్స్‌లో చూడండి
చక్రి సోదరుడు మహిత్ నారాయణ్ కూడా సంగీత దర్శకుడిగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ .. "నాకు మా నాన్న కంటే అన్నయ్యే ఎక్కువ. నాన్న వృత్తి రీత్యా టీచర్. సాయంత్రం సమయాల్లో ఆయన సేవా కార్యక్రమాలలో ఎక్కువగా పాల్గొనేవారు.

అలా ఆయన బిజీగా ఉండటం వలన, నాకు సంబంధించిన అన్ని పనులను మా అన్నయ్యే చేసిపెట్టేవాడు. తనే నా దగ్గరుండి నాకు కావలసినవన్నీ చూసుకునేవాడు. అప్పట్లో మా ఇంట్లో టీవీ ఉండేది కాదు. అందువలన టీవీ వున్న వాళ్లింటికి నన్ను తీసుకెళ్లి, 'రామాయణం' .. 'మహాభారతం' చూపించి తీసుకొచ్చేవాడు. అలా ఏ విషయంలో నాకు ఎలాంటి లోటు రాకుండా చూసుకున్నాడు. అందువలన మా నాన్నకంటే మా అన్నయ్యే నాకు ఎక్కువని చెబుతాను" అని అన్నాడు.
Go Back to Shorts
Mahith
Chakri

More Telugu News