ఉద్ధండరాయునిపాలెంలో మీడియా వాహనాన్ని ధ్వంసం చేసిన నిరసనకారులు
- సచివాలయానికి వెళ్తున్న మీడియా వాహనం
- కర్రలతో దాడి చేసి, అద్దాలను పగలగొట్టిన రైతులు
- కారులోని మీడియా ప్రతినిధులకు గాయాలు
మరోవైపు కారును వెనక్కి మళ్లిస్తున్న తరుణంలో ఓ బైక్ ను కారు ఢీకొంది. అక్కడే ఉన్న పోలీసులు కలగజేసుకుని మీడియా వాహనం అక్కడి నుంచి వెనక్కి వెళ్లేలా చర్యలు తీసుకున్నారు. అమరావతి ప్రాంతంలో 144 సెక్షన్ ఉన్నప్పటికీ ఈ దాడి జరగడం గమనార్హం. కొన్ని మీడియా సంస్థలు అమరావతి రైతులకు వ్యతిరేకంగా కథనాలను ప్రసారం చేస్తున్నాయనే ఆగ్రహంతో ఈ దాడి చేసినట్టు తెలుస్తోంది.