మూడు రాజధానుల ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ.. అమరావతి రైతు ఆత్మహత్యాయత్నం
- శరీరంపై పెట్రోల్ పోసుకోగా.. అడ్డుకున్న పోలీసులు
- అమరావతిని రాజధానిగా కొనసాగించాలంటూ నినాదం
- రాజధాని నిర్మాణానికి నాలుగు ఎకరాల భూమిని ఇచ్చానని వెల్లడి
పోలీసులు అడ్డుకోవడంతో అతని ప్రయత్నం విఫలమైంది. అనంతరం రమేశ్ మీడియా, పోలీసుల ముందు తన ఆవేదనను వెళ్లగక్కాడు. అమరావతి నిర్మాణానికి తాను నాలుగు ఎకరాల భూమిని ఇచ్చానని చెప్పాడు. అమరావతి శాసన రాజధానిగా, విశాఖను ఎగ్జిక్యూటివ్, కర్నూలు జ్యుడీషియల్ రాజధానులుగా చేయాలని వైసీపీ ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అమరావతి ప్రాంత రైతులు ఉద్యమించారు. ఏపీకి ఒకే రాజధాని ఉండాలని డిమాండ్ చేస్తున్నారు.