'రౌడీ బాయ్స్' టైటిల్ ను ఖరారు చేసిన దిల్ రాజు
- 'దిల్' రాజు ఇంటి నుంచి హీరోగా ఆశిశ్ రెడ్డి
- ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి
- జనవరి నుంచి రెగ్యులర్ షూటింగ్
కొన్ని రోజుల క్రితమే ఈ సినిమాకి పూజా కార్యక్రమాలను నిర్వహించారు. ఇప్పుడు ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులను .. స్క్రిప్ట్ పనులను పూర్తిచేసుకుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాకి 'రౌడీ బాయ్స్' అనే టైటిల్ ను ఖరారు చేస్తున్నట్టు తెలుస్తోంది. త్వరలోనే ఈ విషయంపై అధికారిక ప్రకటన వెలువడనుందని చెబుతున్నారు. 'హుషారు' ఫేమ్ శ్రీహర్ష ఈ సినిమాకి దర్శకత్వం వహించనున్నాడు. జనవరి నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది.