Mohammad Shami: అప్పట్లో మార్షల్... ఇప్పుడు షమీ: గవాస్కర్ వ్యాఖ్యలు

  • టీమిండియాలో నిలకడగా రాణిస్తున్న షమీ
  • షమీపై గవాస్కర్ ప్రశంసలు
  • ఆకలిగొన్న చిరుత అంటూ వ్యాఖ్యలు
  • నాటి విండీస్ దిగ్గజం మార్షల్ తో పోలిక

టీమిండియా పేస్ దళానికి ప్రపంచస్థాయి గుర్తింపు తెచ్చిన బౌలర్ మహ్మద్ షమీ. గత కొన్నాళ్లుగా అత్యంత నిలకడగా, ఫార్మాట్ తో సంబంధం లేకుండా, టెస్టులు, వన్డేలు, టీ20లు అన్నింట రాణిస్తున్న ఈ ఫాస్ట్ బౌలర్ టీమిండియా విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. తాజాగా, వెస్టిండీస్ తో వన్డే సిరీస్ గెలవడంలోనూ తనవంతు బాధ్యతలు సమర్థంగా నిర్వర్తించాడు. ఈ నేపథ్యంలో, షమీపై భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ ప్రశంసల వర్షం కురిపించారు.

గతంలో వెస్టిండీస్ లెజెండ్ మాల్కమ్ మార్షల్ ఇదే తరహాలో బౌలింగ్ చేసేవాడని, అతడి బౌలింగ్ ధాటికి నిద్రలో కూడా ఉలిక్కిపడేంతగా భయపడేవాళ్లని గవాస్కర్ వివరించారు. ఇప్పుడు షమీ బౌలింగ్ కూడా నాటి మార్షల్ బౌలింగ్ ను జ్ఞప్తికి తెస్తోందని, షమీని చూస్తుంటే ఆకలిగొన్న చిరుతపులి వేటకు బయల్దేరినట్టుగా ఉందని కితాబిచ్చారు.

More Telugu News