పరిటాల శ్రీరాములయ్య సోదరుడు కన్నుమూత!

  • పరిటాల రవి కుటుంబంలో విషాదం
  • కన్నీరు మున్నీరవుతున్న పరిటాల ఫ్యామిలీ
  • రేపు మధ్యాహ్నం అంత్యక్రియలు
దివంగత తెలుగుదేశం పార్టీ నేత పరిటాల రవి కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది. పరిటాల శ్రీరాములయ్య సోదరుడు గజ్జిలప్ప తీవ్ర అనారోగ్యంతో కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ ఉదయం కన్నుమూశారు. తమకు పెద్దదిక్కుగా ఉన్న గజ్జిలప్ప మృతితో పరిటాల కుటుంబీకులు శోక సముద్రంలో మునిగిపోయారు. ఈ వార్త తెలుసుకున్న పరిటాల అభిమానులు, తెలుగుదేశం పార్టీ నేతలు పెద్దఎత్తున ఆయన ఇంటికి వచ్చి, తమ సంతాపాన్ని వెలిబుచ్చారు. సోమవారం మధ్యాహ్నం పరిటాల గజ్జిలప్ప అంత్యక్రియలు జరుగుతాయని కుటుంబీకులు తెలిపారు.
Go Back to Shorts
Paritala Ravi
Gajjilappa
Died

More Telugu News