బేగంపేటలోని ఓ పబ్ లో అశ్లీల వ్యవహారం.. పోలీసుల అదుపులో యాజమాన్యం, అమ్మాయిలు!
- బేగంపేటలో ఉన్న లిస్బన్ రెస్టారెంట్ అండ్ పబ్
- కస్టమర్లను ఆకట్టుకునేందుకు ఎరగా యువతులు
- ఎంతగా ఆకట్టుకుంటారో అంతగా నజరానాలు
తమ రెస్టారెంట్ అండ్ పబ్ కు వచ్చే యువకులను ఆకర్షించేందుకు ఆ అమ్మాయిలతో అశ్లీల పనులు చేయిస్తున్నట్టు పోలీసుల సమాచారం. కస్టమర్లను ఎవరైతే ఎక్కువగా ఆకట్టుకుంటారో, మద్యం కొనేలా చేస్తారో ఆ అమ్మాయి లేదా అమ్మాయిలకు నజరానాల కింద సొమ్ము, గిప్ట్ లను యాజమాన్యం ముట్టచెబుతున్నట్టు తెలిసింది. పబ్ యాజమాన్యం ప్రోద్బలం మేరకే తాము ఈ విధంగా చేస్తున్నట్టు పోలీసుల అదుపులో ఉన్న యువతులు చెప్పినట్టు సమాచారం. లిస్బన్ పబ్ యాజమాన్యాన్ని పోలీసులు అదుపులోకి తీసుకుంది. పబ్ ను సీజ్ చేశారు.