పౌరసత్వ సవరణ బిల్లుతో భారతీయ ముస్లింలకు సంబంధం లేదు: 'ఢిల్లీ జామా మసీదు' షాహి ఇమామ్
- నిరసన వ్యక్తం చేయడం రాజ్యాంగం కల్పించిన హక్కు
- నిరసన తెలిపే సమయంలో భావోద్వేగాలను నియంత్రించుకోవడం ముఖ్యం
- పౌరసత్వ సవరణ చట్టానికి, జాతీయ పౌర రిజిస్టర్ కు చాలా తేడా ఉంది
పౌరసత్వ సవరణ చట్టానికి, జాతీయ పౌర రిజిస్టర్ కు చాలా తేడా ఉందనే విషయాన్ని అందరూ గ్రహించాలని బుఖారీ తెలిపారు. పౌరసత్వ సవరణ బిల్లు ఇప్పటికే చట్ట రూపం దాల్చిందని... జాతీయ పౌర రిజిస్టర్ ఇంకా చట్టంగా మారలేదని చెప్పారు. పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్, బంగ్లాదేశ్ ల నుంచి వచ్చి ఇక్కడ ఆశ్రయం పొందుతున్న ముస్లింలకు పౌరసత్వ సవరణ చట్టం ద్వారా భారత పౌరసత్వం లభించదని తెలిపారు. భారతీయ ముస్లింలకు దీంతో ఎలాంటి సంబంధం లేదని చెప్పారు.