టీఆర్ఎస్ లో బాహుబలులు, కట్టప్పలు ఉంటే మోదీ వద్ద బ్రహ్మాస్త్రం ఉంది: లక్ష్మణ్

  • మోదీ చేస్తున్న అభివృద్ధి అనేకమందిని ఆకర్షిస్తోందని వ్యాఖ్యలు
  • కేసీఆర్ యాగాలు కొడుకు కోసమేనని విమర్శ
  • సూర్యాపేటలో కృష్ణానదిలో మూసీ కలిసే చోటును పరిశీలించిన లక్ష్మణ్
తెలంగాణ అధికార పక్షం టీఆర్ఎస్ పైనా, సీఎం కేసీఆర్ పైనా రాష్ట్ర బీజేపీ చీఫ్ డాక్టర్ లక్ష్మణ్ ధ్వజమెత్తారు. టీఆర్ఎస్ పార్టీలో బాహుబలులు, కట్టప్పలు ఉన్నారని చెప్పుకుంటున్నారని, కానీ అలాంటి వారందరినీ తలదన్నే బ్రహ్మాస్త్రం ప్రధాని మోదీ వద్ద ఉందని అన్నారు. బ్రహ్మాస్త్రం ముందు మరే అస్త్రం పనిచెయ్యదని ఎద్దేవా చేశారు. మోదీ చేస్తున్న అభివృద్ధి అనేకమందిని ఆకట్టుకుంటోందని, వారందరూ బీజేపీ సభ్యత్వం స్వీకరిస్తున్నారని తెలిపారు. సీఎం కేసీఆర్ తరచుగా యజ్ఞయాగాదులు నిర్వహించడానికి కారణం కొడుకు కేటీఆర్ రాజకీయ భవిష్యత్తు కోసమేనని ఆరోపించారు. సూర్యాపేట వద్ద కృష్ణానదిలో మూసీ నది కలిసే చోటును పరిశీలించేందుకు లక్ష్మణ్ పార్టీ నేతలతో వచ్చారు.
Go Back to Shorts
TRS
BJP
Lakshman
Narendra Modi
KCR
KTR

More Telugu News