రండి.. కదలి రండి.. పోరాడదాం: కోల్ కతాలో మమతా బెనర్జీ మెగా ర్యాలీ
- ట్వీట్లు చేసిన మమత
- సీఏఏ, ఎన్‌ఆర్‌సీలను వ్యతిరేకిస్తూ ర్యాలీ
- శాంతియుతంగా ఈ ప్రజా ఉద్యమంలో పాల్గొందామని పిలుపు
'రాజ్యాంగ పరిధిలో శాంతియుతంగా ఈ ప్రజా ఉద్యమంలో పాల్గొందాం. సమాజంలోని అన్ని వర్గాల ప్రజలు కదలి రండి. రాజ్యాంగ విరుద్ధమైన పౌరసత్వ సవరణ చట్టం, ఎన్‌ఆర్‌సీలపై కోల్ కతాలో మెగార్యాలీ నిర్వహిస్తున్నాం. ఈ రోజు మధ్యాహ్నం రెడ్ రోడ్ లోని బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహం నుంచి ఈ ర్యాలీ ప్రారంభమై జోరాసంకో ఠాకుర్బారీ వద్ద ముగుస్తుంది' అని మమతా బెనర్జీ ట్వీట్లు చేశారు.