కాల్ మనీ వేధింపులు.. తాడేపల్లి పీఎస్ వద్ద యువకుడి ఆత్మహత్యాయత్నం!
- ఉండవల్లికి చెందిన నివాసి వెంకట్రామయ్య
- ఫిర్యాదు చేసిన పోలీసులు పట్టించుకోవట్లేదని ఆరోపణ
- రూ.6 లక్షలు తీసుకుంటే రూ.23 లక్షలు వసూలు చేశారని ఆరోపణ
ఆరు లక్షల రూపాయలు తీసుకున్న తన వద్ద నుంచి ఇప్పటి వరకూ ఇరవై మూడు లక్షల రూపాయలు వడ్డీల రూపంలో వసూలు చేశారని ఆరోపించాడు. తనకు డబ్బులు ఇచ్చినప్పుడు మూడు రూపాయల వడ్డీ అని చెప్పి పన్నెండు రూపాయల చొప్పున వసూలు చేశారని ఆరోపించిన వెంకట్రామయ్య, డబ్బులు ఇవ్వకపోతే చంపేస్తామని సదరు వ్యాపారి బెదిరించినట్టు ఆరోపించాడు.