Maharashtra: ప్లీజ్.. మా నాన్నకు జీతం పెంచండి, సీఎం.. ఉద్ధవ్ కు లేఖ రాసిన ఆరేళ్ల పాప

  • నా తండ్రి అంబాద్‌ డిపోలో బస్‌ కండక్టర్‌గా పనిచేస్తున్నాడు
  • తక్కువ వేతనం వస్తుండడంతో ఓవర్ టైమ్ పని చేస్తున్నాడు
  • నా తండ్రితో అధిక సమయం గడపలేకపోతున్నాను

మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరేకు ఓ పాప లేఖ రాసి, తన తండ్రికి వేతనం పెంచాలని కోరింది. తన తండ్రికి తక్కువ వేతనం అందుతోందని, ఈ కారణంగా తన తండ్రి ఎక్కువ సమయం విధుల్లో ఉంటున్నాడని జల్నా ప్రాంతానికి చెందిన శ్రియా హరాలే తన లేఖలో పేర్కొంది.

తన తండ్రి అంబాద్‌ డిపోలో బస్‌ కండక్టర్‌గా పనిచేస్తున్నాడని తెలిపింది. తక్కువ వేతనం వస్తుండడంతో ఓవర్ టైమ్ పని చేస్తూ ఎక్కువ సమయం అతడు విధుల్లోనే ఉంటున్నాడని ఆమె పేర్కొంది. ఇంటి వద్ద తన తండ్రి ఎక్కువ సమయం  ఉండట్లేదని, దీంతో అతడితో గడపలేకపోతున్నానని ఆవేదన వ్యక్తం చేసింది.  ఆ  బాలిక తండ్రి మీడియాతో మాట్లాడుతూ.. తన కూతురు తన వేతనం గురించి సీఎంకు లేఖ రాసి పోస్ట్‌ చేయమని తనకు ఇచ్చిందని, తాను ఆ లేఖను ఆర్డినరీ పోస్ట్‌ ద్వారా పంపానని చెప్పారు. ఆ లేఖ సీఎం ఉద్ధవ్ కు చేరిందో లేదో తనకు తెలియదని తెలిపారు.

More Telugu News