నిర్భయ దోషులకు జైలులో ఆంక్షలు విధించిన అధికారులు.. ఉరితీత గది శుభ్రం!
- దోషులు ఒకరితో మరొకరు మాట్లాడుకోకుండా ఆంక్షలు
- వేర్వేరు గదులకు షిప్ట్ చేసిన అధికారులు
- తమిళనాడు నుంచి ప్రత్యేక పోలీసు దళం
మరోవైపు, తీహార్ జైలులో అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. ఇందుకోసం తమిళనాడు నుంచి ప్రత్యేక పోలీసు దళాన్ని రప్పించారు. మండోలీ జైలులో ఉన్న మరో దోషి పవన్ కుమార్ గుప్తాను అత్యంత రహస్యంగా సాయుధ గార్డుల భద్రత మధ్య తీహార్ జైలుకు తీసుకువచ్చారు. జైలులోని ఉరితీసే గదిని శుభ్రం చేశారు. తుప్పు పట్టిన ఉరిస్తంభాన్ని శుభ్రం చేయించి విద్యుత్ దీపాలను ఏర్పాటు చేశారు.