భారీ లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు
- ఉద్దీపనలు ప్రకటించవచ్చన్న సంకేతాలతో మదుపుదార్లలో జోష్
- 428 పాయింట్లు పెరిగి 41,009.71 వద్ద ముగిసిన సెన్సెక్స్
- నిఫ్టీ 115 పాయింట్లు పెరిగి 12,086.70 వద్ద ముగింపు
ఉదయం 250 పాయింట్లను మించిన లాభంతో ట్రేడింగ్ ప్రారంభించిన సెన్సెక్స్ సాయంత్రవరకు అదే జోరుతో సాగింది. ఫార్మాకంపెనీల షేర్లు మినహా దాదాపు అన్ని రంగాల షేర్లు ఈ రోజు లాభాలతో ముందుకు సాగాయి. డాలర్ తో రూపాయి మారకం విలువ 70.78గా కొనసాగుతోంది.