నిర్భయ దోషులు నలుగురికీ ఒకేసారి ఉరి... తాళ్లకు వెన్నపూస పూయాలని అధికారుల నిర్ణయం!
- నలుగురికీ ఒకేసారి శిక్ష అమలు
- తక్కువ నొప్పితో ప్రాణాలు పోయేందుకు చర్యలు
- ఉరికొయ్యలను పరిశీలించిన అధికారులు
నలుగురికీ ఒకేసారి ఉరిశిక్షను అమలు చేయాలని భావిస్తున్న జైలు అధికారులు, బీహార్ లోని బక్సర్ సెంట్రల్ జైలు నుంచి 8 మనీలా ఉరితాళ్లను తెప్పిస్తున్నారు. ఇవి మృదువుగా, బలంగా ఉండేలా చూడటంతో పాటు దోషులు తక్కువ బాధతో ప్రాణాలు విడిచేందుకు వీలుగా తాళ్లకు వెన్నపూస రాయాలని నిర్ణయించారు. జైలు నిబంధనల ప్రకారం ప్రతి 15 రోజులకూ ఒకసారి దోషులు తమ కుటుంబ సభ్యులను కలిసేందుకు అనుమతిస్తున్నామని తెలిపిన అధికారులు, వారు నిత్యమూ న్యాయవాదులను కలుస్తూ, తమ కేసు పురోగతిని తెలుసుకుంటున్నారని, వారి ప్రవర్తనలో తాము ఎటువంటి మార్పునూ గమనించలేదని స్పష్టం చేశారు.