Supreme Court: అసలు అక్కడ వాస్తవంగా ఏం జరిగిందో ఎవరికీ తెలియదు!: దిశ ఎన్ కౌంటర్ పై సుప్రీంకోర్టు

  • దిశ నిందితుల ఎన్ కౌంటర్ పై సుప్రీంకోర్టులో విచారణ
  • పూర్తిగా ఉద్దేశపూర్వకంగా చేసినట్లు ఉందన్న పిటిషనర్  
  • మీరెందుకు పిటిషన్ వేశారని జీఎస్ మణిని ప్రశ్నించిన సీజేఐ

సంచలనం సృష్టించిన 'దిశ' నిందితుల ఎన్ కౌంటర్ పై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతోంది. పిటిషనర్ జీఎస్ మణితో పాటు తెలంగాణ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి వాదనలు వినిపిస్తున్నారు. ఈ ఎన్ కౌంటర్ తీరు పూర్తిగా ఉద్దేశపూర్వకంగా చేసినట్లు ఉందని పిటిషనర్ జీఎస్ మణి అన్నారు.

అయితే, మీరెందుకు పిటిషన్ వేశారని జీఎస్ మణిని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. అసలు అక్కడ వాస్తవంగా ఏం జరిగిందో ఎవరికీ తెలియదని సీజే జస్టిస్ బోబ్డే వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి వాదనలు వినిపిస్తూ ఎన్ కౌంటర్ జరిగిన తీరును వివరించారు.

పోలీసుల పిస్తోళ్లను దిశ కేసులోని ఇద్దరు నిందితులు లాక్కొని కాల్పులు జరిపారని ఆయన అన్నారు. ఈ పరిస్థితుల్లోనే ఎన్ కౌంటర్ జరిగిందన్నారు. గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలను ఉల్లంఘించలేదని ఆయన చెప్పారు.

More Telugu News