YSRCP: విజయసాయిరెడ్డికి బుద్ధా వెంకన్న ఘాటు కౌంటర్

  • అప్పులు తెచ్చి పసుపు-కుంకుమకు ఇచ్చామా?  
  • ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దారుణం
  • మహిళలను కించపరిచేలా మాట్లాడొద్దు
టీడీపీ హయాంలో చంద్రబాబునాయుడు సివిల్‌ సప్లైస్‌ కార్పొరేషన్‌ పేరిట రూ.13,500 కోట్లు అప్పులు తెచ్చి పసుపు-కుంకుమ, పప్పు బెల్లాలకు పంచిపెట్టారంటూ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలపై టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న ఘాటుగా స్పందించారు.

ఈ తరహా వ్యాఖ్యలు విజయసాయిరెడ్డి, జగన్ చేయడం దారుణమని, మహిళలను కించపరిచే విధంగా మాట్లాడొద్దని హితవు పలికారు. వైసీపీ సర్కార్ మహిళా వ్యతిరేక ప్రభుత్వం అని చెప్పడానికి వారు చేసిన వ్యాఖ్యలే నిదర్శనమని ధ్వజమెత్తారు. కష్టాల్లో ఉన్న మహిళలను ఆదుకోవాలనే ఆలోచన చంద్రబాబుది అని, తన కష్టాలు తీరగానే మహిళలను మర్చిపోయే మనస్తత్వం జగన్ ది అని విమర్శించారు.
YSRCP
vijayasaireddy
Telugudesam
Buddha

More Telugu News