KCR: సొంత నియోజక వర్గం గజ్వేల్ లో పర్యటిస్తోన్న కేసీఆర్

షార్ట్స్‌లో చూడండి
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ తన సొంత నియోజక వర్గం గజ్వేల్‌లో పర్యటిస్తున్నారు. ములుగులో అటవీ కళాశాల, పరిశోధన కేంద్రాన్ని ప్రారంభించి, పైలాన్ ను ఆవిష్కరించారు. అనంతరం అక్కడ మొక్క నాటారు. అక్కడి అధికారులు, విద్యార్థులతో ఆయన మాట్లాడుతున్నారు.

కాసేపట్లో ఆయన గజ్వేల్‌, ప్రజ్ఞాపూర్‌ మున్సిపాలిటీ అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ పనులకు శంకుస్థాపన చేస్తారు. అనంతరం గజ్వేల్‌ టౌన్‌లో వంద పడకల మాతా, శిశు ఆసుపత్రికి శంకుస్థాపన చేస్తారు. గజ్వేల్‌ పట్టణంలో సమీకృత మార్కెట్‌ను, సమీకృత కార్యాలయ కాంప్లెక్స్‌ను కూడా ఆయన ప్రారంభించనున్నారు. గజ్వేల్‌ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్‌ ఆఫీస్‌ నుంచి సాయంత్రం 4.30 గంటలకు సీఎం కేసీఆర్ తిరిగి హైదరాబాద్ లోని ప్రగతిభవన్‌కు చేరుకుంటారు.
Go Back to Shorts
KCR
TRS
Telangana

More Telugu News