కొన్ని పార్టీలకు, పాకిస్థాన్ కు తేడా లేకుండా పోయింది: ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు
- నేడు రాజ్యసభకు పౌరసత్వ బిల్లు
- బీజేపీ నేతలతో సమావేశమైన మోదీ
- విపక్షాల కామెంట్లపై మండిపాటు
ఈ బిల్లుతో నష్టం అధికమని పాకిస్థాన్ చెబుతోందని గుర్తు చేస్తూ, పక్క దేశాల వ్యవహారాలపై వారికి అవసరం ఏంటని ప్రశ్నించారు. పాక్ నేతలు మాట్లాడుతున్నట్టుగానే, కొన్ని పార్టీలు కామెంట్లు చేస్తున్నాయని మోదీ అన్నారు. ఈ బిల్లును ప్రవేశపెట్టాలన్నది తమ మేనిఫెస్టోలోనే ఉందని, ఇచ్చిన హామీని ఇప్పుడు అమలులోకి తీసుకుని వస్తున్నామని ఆయన అన్నారు. కాగా, పౌరసత్వ బిల్లు నేటి మధ్యాహ్నం 12 గంటలకు రాజ్యసభ ముందుకు రానుండగా, తమ ఎంపీలకు కాంగ్రెస్ ఇప్పటికే విప్ జారీ చేసిన సంగతి తెలిసిందే.